విద్యుత్ షాక్ తో వృద్ధురాలు మృతి

1334చూసినవారు
విద్యుత్ షాక్ తో వృద్ధురాలు మృతి
బుక్కపట్నం మండలంలోని యాదాలంకపల్లి గ్రామంలో బుధవారం, గొల్ల అక్కమ్మ అనే వృద్ధురాలు విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. ఆమె తన ఇంటి వద్ద రేకుల షెడ్డు కింద పనిచేస్తుండగా, షెడ్డుకు విద్యుత్ ప్రసరణ జరిగి ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న విద్యుత్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు నిర్ధారించారు. గ్రామస్థులు ఈ విషయాన్ని ధృవీకరించారు.

సంబంధిత పోస్ట్