సత్యసాయి జిల్లా పోలీసులు హైవేలో దోపిడీలకు పాల్పడుతున్న ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఈ వివరాలను వెల్లడించారు. నిందితుల వద్ద నుండి రూ. 1.26 కోట్ల నగదు, ఒక ఇన్నోవా, ఒక బీఎండబ్ల్యూ, మరో మూడు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిని కోర్టులో ప్రవేశపెట్టి, కస్టడీకి తీసుకొని పూర్తి విచారణ చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు.