‘బొకేలు వద్దు.. బుక్సే ముద్దు’

578చూసినవారు
‘బొకేలు వద్దు.. బుక్సే ముద్దు’
అనంతపురం, సత్యసాయి జిల్లాల ప్రజలకు కలెక్టర్లు ఆనంద్, శ్యాంప్రసాద్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026లో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, కొత్త ఏడాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. సందర్శకులు బొకేలు, కేకులకు బదులు విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు, పెన్నులు తీసుకురావాలని కోరారు. అనంతపురం కలెక్టరేట్‌లో ఉ.10 నుంచి 'మీట్ అండ్ గ్రీట్' నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్