పుట్టపర్తిలోని విమానాశ్రయాన్ని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈనెల 23న సత్య సాయిబాబా శత జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు పుట్టపర్తికి వస్తున్న నేపథ్యంలో, విమానాశ్రయం వద్ద తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లపై ఆయన చర్చించారు. ప్రముఖుల రాకను దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన భద్రత కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.