ఉపాధి కూలీలతో సత్యసాయి జిల్లా కలెక్టర్ మాటామంతీ

653చూసినవారు
ఉపాధి కూలీలతో సత్యసాయి జిల్లా కలెక్టర్ మాటామంతీ
బుక్కపట్నం మండలం గువ్వలకొండలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ బుధవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా కూలీలకు సకాలంలో మెడికల్ కిట్లు, పనిముట్లు అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కూలీల సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్