పుట్టపర్తిలో మాదక ద్రవ్యాల అనర్థాలపై యువతకు అవగాహన కల్పించిన యువకుడు వాసుదేవకు వైబ్రేంట్స్ ఆఫ్ కలం ఫౌండేషన్ బుధవారం అవార్డు ప్రదానం చేసింది. ఈ సందర్భంగా బిజెపి నాయకులు చింత శరత్ కుమార్, వెంకట రంగారెడ్డి తదితరులు వాసుదేవను అభినందించారు. యువకుడి సేవలను గుర్తించి అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని గుర్తింపులు పొందాలని వారు ఆకాంక్షించారు. అనంతరం వాసుదేవను శాలువా కప్పి, పూలమాలతో సన్మానించారు.