ప్రయత్నం ఉంటేనే విజయం సాధ్యం: కలెక్టర్

477చూసినవారు
ప్రయత్నం ఉంటేనే విజయం సాధ్యం: కలెక్టర్
ఏదైనా సాధించాలంటే పట్టుదలతో ప్రయత్నం చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ విద్యార్థులకు సూచించారు. చిలమత్తూరు మండలం టేకులోడులోని శ్రీ మహాత్మ జ్యోతిరావు ఫూలే ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలో పదో తరగతి విద్యార్థుల కోసం నిర్వహించిన 100 రోజుల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలు అలవర్చుకొని చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you