పుట్టపర్తిలో శనివారం రాత్రి మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు తీవ్రంగా నిరసన తెలిపారు. అంబటి దిష్టిబొమ్మను దహనం చేసి, ఆయన చిత్రపటాలను చెప్పులతో కొట్టారు. టీడీపీ నాయకుడు సామకోటి ఆదినారాయణ మాట్లాడుతూ, రాంబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే నాలుక చీరేస్తామని హెచ్చరించారు.