సత్యసాయి జిల్లా గుడిబండ తహశీల్దార్ శ్రీధర్ రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. భూమి పాసు పుస్తకాల మంజూరు కోసం షేక్ సద్దాం అనే రైతు నుంచి ఆయన రూ.లక్ష డిమాండ్ చేశారు. ఇప్పటికే రూ.63 వేలు చెల్లించానని, మళ్లీ డబ్బు అడగడంతో అధికారులను ఆశ్రయించానని బాధితుడు తెలిపారు. మరోవైపు నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కేసు విచారణ చేపట్టారు.