పుట్టపర్తి పట్టణంలో సోమవారం ఉదయం నుంచి వర్షం ప్రారంభమైంది. తెల్లవారుజామున మూడు గంటలకు ప్రారంభమైన వర్షం ఏకధాటిగా కురుస్తుండడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఆధ్యాత్మిక పట్టణమైన పుట్టపర్తిలో వర్షం ప్రభావంతో సత్యసాయి భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు.