పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువు ఎస్సీ కాలనీలో మౌనిక (24) అనే వివాహిత తన బెడ్రూమ్లో ఉరేసుకుని మృతి చెందింది. కొంతకాలంగా కుటుంబ కలహాలు, వేరు కాపురం అంశాలపై విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన సమయంలో భర్త భాస్కర్ ఇంట్లో లేకపోవడంతో యువతి కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.