అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

1191చూసినవారు
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
నల్లమాడ మండలం కుటాలపల్లికి చెందిన బాసం సాయి సంకీర్తన (17) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శనివారం ఉదయం బహిర్భూమికి వెళ్లి ఇంటికి తిరిగి రాని ఆమె కోసం బంధువులు వెతికారు. సింగనేయకుంట నీటిలో మునిగి చనిపోయిందని అటుగా వెళ్లిన వ్యక్తులు తెలిపారు. ఈ మేరకు ఎస్సై ఎం. సతీశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్