మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర 3వ రోజు సత్యసాయి జిల్లాలో కొనసాగింది. రాఘవంపల్లిలో APCC అధ్యక్షురాలు YS షర్మిల మట్టి తవ్వి శ్రమదానం చేశారు. పాలకులు ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, 100 రోజుల పని కల్పించడంలో విఫలమయ్యారని ఆమె విమర్శించారు. VB G-RAM G చట్టంతో కలిగే నష్టాలను వివరించారు. అర్హులైన పేదల జాబ్ కార్డులను తొలగించడంపై కూలీలు ఆవేదన వ్యక్తం చేయగా, కాంగ్రెస్ అండగా ఉంటుందని షర్మిల భరోసా ఇచ్చారు.