రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన కియా బస్సు డ్రైవర్ కురుబ మల్లికార్జున మంగళవారం రోడ్డు ప్రమాదంలో మరణించారు. మంగళవారం విధులను ముగించుకుని ద్విచక్ర వాహనంపై గ్రామానికి తిరిగి వస్తుండగా, ధర్మవరం-మేడాపురం క్రాస్ వద్ద మరో వాహనం బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన ఆయనను స్థానికులు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.