మద్యం దుకాణాల రెన్యువల్ ప్రక్రియ: దరఖాస్తులకు ఆహ్వానం

4చూసినవారు
మద్యం దుకాణాల రెన్యువల్ ప్రక్రియ: దరఖాస్తులకు ఆహ్వానం
శ్రీ సత్య సాయి జిల్లా ఎక్సైజ్ అధికారి బి. నరసింహులు ఆదేశాల మేరకు, ధర్మవరం ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని రెన్యువల్ కాని ఆరు మద్యం దుకాణాలకు దరఖాస్తు ప్రకటన వెలువడింది. ఈ మేరకు మంగళవారం ధర్మవరం ఎక్సైజ్ స్టేషన్‌లో లైసెన్సుదారులతో సమావేశం నిర్వహించారు. గెజిట్ నెంబర్ 05 (ధర్మవరం మున్సిపాలిటీ), 12 (ధర్మవరం రూరల్), 13 (బత్తలపల్లి), 16 (తాడిమర్రి), 17, 18 (ముదిగుబ్బ) మండలాల్లోని మొత్తం ఆరు దుకాణాలకు అక్టోబర్ 1వ తేదీ అర్ధరాత్రి వరకు గడువు ఉంటుందని ఎక్సైజ్ సీఐ చంద్రమణి తెలిపారు.

సంబంధిత పోస్ట్