రాప్తాడు నియోజకవర్గంలోని సికేపల్లి మండలంలో గల ఎన్ఎస్ గేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం జాతీయ డాక్టర్స్ డేను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ రవికుమార్, సత్య ప్రియ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో డాక్టర్ రవి నాయక్ కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పీహెచ్‌సీ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.