రాయదుర్గం నియోజకవర్గం, సి.కె.పల్లి మండలం, స్టోర్ డీలర్ నరసింహులు కుమారుడు సుబ్రహ్మణ్యం వివాహం ధర్మవరం పట్టణంలోని స్కంద కళ్యాణ మండపంలో ఆదివారం జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి రాప్తాడు ఎమ్మెల్యే సునీత, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాళ్యం రామ సుబ్బమ్మ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే సునీత తన అనుచరులు, మిత్రులతో కాసేపు ముచ్చటించి వెళ్లారు.