బైక్ ఢీకొని రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ మృతి

3320చూసినవారు
బైక్ ఢీకొని రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ మృతి
ధర్మవరం పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ రోడ్ మాంగల్య షాపింగ్ మాల్ సమీపంలో గుర్తు తెలియని బైక్ ఢీకొని రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ సూర్యనారాయణ రెడ్డి (73) మృతి చెందారు. వన్ టౌన్ సీఐ తెలిపిన వివరాల ప్రకారం, పార్థసారధి నగర్ కు చెందిన మృతుడు సోమవారం రాత్రి రోడ్డు దాటుతుండగా ఈ ఘటన జరిగింది. తలకు తీవ్ర గాయాలవడంతో స్థానికులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్