జీతాలు లేక సత్యసాయి పంప్ హౌస్ కార్మికుల ఆందోళన

866చూసినవారు
ధర్మవరం పట్టణం సమీపంలోని ఎర్రగుంట సత్యసాయి పంప్ హౌస్ వద్ద బుధవారం రెండవ రోజు కార్మికులు నిరసన తెలిపారు. గ్రామీణ ప్రజలకు తాగునీటి సరఫరా చేస్తున్న తమకు దాదాపు 5 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని, దీంతో నిత్యావసర సరుకులు కూడా అప్పు తెచ్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించి, తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు అధికారులను డిమాండ్ చేశారు. డిమాండ్లు తీర్చకపోతే నిరసన కార్యక్రమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నారాయణ, కుమార్ రెడ్డి, రామాంజి, మహమ్మద్ రఫీ, రియాజ్ భాషా, మస్తాన్, రమణ నాయక్ పాల్గొన్నారు.