అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో బుధవారం డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ వీరాభిమాని బోయ చీమల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు లడ్డూలను వడ్డించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు,
విద్యార్థులు అనిల్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.