
రాయదుర్గం: మున్సిపల్ బడ్జెట్ అంచనా రూ. 45. 49కోట్లు
రాయదుర్గం మున్సిపల్ కౌన్సిల్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 45.49 కోట్ల వార్షిక బడ్జెట్ను ఆమోదించింది. బుధవారం చైర్ పర్సన్ పోరాళ్ల శిల్ప అధ్యక్షతన జరిగిన సమావేశంలో, ప్రారంభ నిల్వ కింద రూ. 11.64 కోట్లు, మూలధన జమ కింద రూ. 33.85 కోట్లు, ఖర్చుల కింద రూ. 44.39 కోట్లుగా అంచనా వేశారు. అంతిమంగా రూ. 1.10 కోట్ల మిగులుతో బడ్జెట్ తీర్మానం చేశారు. కౌన్సిలర్ బండి అజయ్ కణేకల్లు రహదారి నుంచి టీచర్స్ కాలనీ వరకు డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని కోరారు.






































