కణేకల్లు లో ఇరు వర్గాల దాడి.. యువకులకు గాయాలు

3268చూసినవారు
కణేకల్లు లో ఇరు వర్గాల దాడి.. యువకులకు గాయాలు
కణేకల్లు మండలం హనకనహల్లో పీర్ల పండగ రోజు యువకుల మధ్య తలెత్తిన గొడవ శనివారం దాడులకు దారితీసింది. బెళుగుప్పకు వెళ్తున్న వంశీ, సిద్ధార్థతో వన్నూరుస్వామి కొడుకులు గొడవపడగా, ఇరువర్గాల బంధువుల జోక్యంతో ఘర్షణ పెరిగింది. ఈ ఘటనలో వంశీ, సిద్ధార్థ, బసవరాజు, వన్నూరస్వామితో పాటు మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి, గ్రామంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్