రాయదుర్గం పట్టణ శివారులోని కుంటి మారెమ్మ గుడి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, మృతుడి వివరాలను సేకరించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.