గురుకులంలో మధ్యాహ్న భోజన పథకం తీరుపై పీడీఎస్యూ పరిశీలన

12చూసినవారు
గురుకులంలో మధ్యాహ్న భోజన పథకం తీరుపై పీడీఎస్యూ పరిశీలన
రాయదుర్గంలోని డా. బి. ఆర్ అంబేద్కర్ గురుకులంలో (బాలుర) పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును మంగళవారం పీడీఎస్యూ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల ప్రసాద్ పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన, పౌష్టికాహారంతో కూడిన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రిన్సిపాల్‌ను ఆయన సూచించారు. భోజనం నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణ, భోజన సామాగ్రి నిల్వలను ఆయన పరిశీలించారు.

సంబంధిత పోస్ట్