విద్యార్థులకు బ్యాగుల పంపిణీ: క్రమశిక్షణతో జీవితంలో విజయం సాధించవచ్చు

3822చూసినవారు
విద్యార్థులకు బ్యాగుల పంపిణీ: క్రమశిక్షణతో జీవితంలో విజయం సాధించవచ్చు
సింగనమల మండలం పెరవలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం గ్రామస్తుల ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ముక్కెర హరినాథ్ మాట్లాడుతూ, విద్యార్థులు చిన్నతనం నుంచే క్రమశిక్షణ అలవర్చుకోవాలని, క్రమశిక్షణతో జీవితంలో దేనినైనా సాధించవచ్చని పిలుపునిచ్చారు. ఈ సేవా కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్