గూగూడు కుళ్లాయి స్వామి చివరి దర్శనం: వేలాది భక్తుల పోటెత్తు

4చూసినవారు
గూగూడు కుళ్లాయి స్వామి చివరి దర్శనం: వేలాది భక్తుల పోటెత్తు
గూగూడు గ్రామంలో సోమవారం రాత్రి కుళ్లాయి స్వామి చివరి దర్శనమిచ్చారు. 11 రోజుల పాటు జరిగిన ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. 'కుళ్లాయి స్వామి గోవిందా, ఆంజనేయ స్వామి గోవిందా' నినాదాలతో గ్రామం మార్మోగింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వచ్చే ఏడాది వరకు స్వామివారి దర్శన భాగ్యం కలగనుంది.