అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ ప్రకాశం మున్సిపల్ హై స్కూల్ లో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి
బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ పి. వి. ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు జే అంకాల్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి యం. ఆంజనేయులు, జిల్లా అధికార ప్రతినిధి చెవ్వ రంగనాథ్ రెడ్డి, తాడిపత్రి పట్టణ అధ్యక్షులు చెన్నా రంగనాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 25 కోట్ల భారతీయ చిన్నారుల కలలను నెరవేర్చే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరిగింది.