
ప్రతిభ చాటిన తాడిపత్రి విద్యార్థి
తాడిపత్రికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి చాంద్ హాపీజ్ నవాజ్ జిల్లా సైన్స్ సెంటర్ కోసం ఒక వెబ్ సైట్ మరియు ఆండ్రాయిడ్ యాప్ ను రూపొందించారు. అనంతపురంలోని జేఎన్టీయూ యూనివర్సిటీలో గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు, అగస్టా ఫౌండేషన్ సీఈవో పుష్ప చేతుల మీదుగా ఈ వెబ్ సైట్, యాప్ ను ఆవిష్కరించారు. విద్యార్థులు తమ ఆలోచనలతో ఎన్నో ఆవిష్కరణలు చేయవచ్చని ఈ సందర్భంగా విద్యార్థిని అభినందించారు.








































