
ఉరవకొండ: పేదలకు వైద్యాన్ని దూరం చేస్తే ఊరుకోం
ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసి పేదలకు వైద్యాన్ని దూరం చేయాలని చూస్తే ఊరుకోబోమని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ సమన్వయకర్త వై. విశ్వేశ్వరరెడ్డి కూటమి సర్కార్ను హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటిసంతకాల కార్యక్రమాన్ని ఉరవకొండలోని గుంతకల్లు రోడ్డు వద్ద సోమవారం ఆయన చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని, కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని ఆయన అన్నారు.







































