ఉరవకొండ పట్టణంలోని 124వ బూత్ పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లి ఓటరు వివరాలను BLA రమేష్, బీఎల్‌ఓ మంజునాథ్ పరిశీలించారు. ఎమ్మార్వో అరుణ మేడం, MPDO బి.వి. రవి ప్రసాద్ కార్యక్రమాన్ని సందర్శించి, సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా పరిశీలన, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో బీఎల్‌ఏ పాల్గొన్నారు.