
30 గ్రామాలకు నెలకు ఒకసారి నీరే: బీఎస్పీ నాయకుడి ఆవేదన
హాలహర్వి మండలం బాపురం మంచినీటి పంప్ హౌస్ దుస్థితిపై బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామలింగయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పంప్ హౌస్ ను పరిశీలించిన ఆయన, 30కి పైగా గ్రామాలకు నీటి సరఫరా చేస్తున్న ఒకే ఫిల్టర్ మిషన్ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, గ్రామాలకు నెలకు ఒకసారి మాత్రమే తాగునీరు అందుతోందని తెలిపారు. మరో ఫిల్టర్ ఏర్పాటు చేసి, ప్రతి గ్రామానికి మూడు రోజులకు ఒకసారి నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. స్టోరేజ్ ట్యాంక్ వద్ద ముళ్ళ కంప పెరిగి నీరు ఇంకిపోతోందని, గత ఆరు నెలలుగా పనిచేస్తున్న 36 మంది కార్మికులకు వేతనాలు విడుదల చేసి, నీటి సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.



































