
మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్
AP: ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు నవభారత్ నగర్లోని ఆయన నివాసం వద్ద TDP నేతలు, కార్యకర్తలు 6 గంటల పైగా ఆందోళనకు దిగారు. ఇంటిపై రాళ్లు రువ్వి, వాహనాలు ధ్వంసం చేయగా, మహిళలు చెప్పులు, చీపుర్లతో నిరసన వ్యక్తం చేశారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ పోలీసులు అంబటిని అదుపులోకి తీసుకుని నల్లపాడు పీఎస్కు తరలిస్తున్నారు.




