
తంగి పాపారావు భార్యకు పెన్షన్ మంజూరు
ఆమదాలవలస మున్సిపాలిటీ 6వ వార్డులోని దానపురం గ్రామంలో తంగి పాపారావు మరణానంతరం, ఆయన భార్య నరసమ్మకు పెన్షన్ మంజూరు అయింది. ఈ పెన్షన్ను వార్డ్ ఇంచార్జ్ పాతిన వెంకటరమణ అందజేశారు. పెన్షన్ అందుకున్న కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ, కూటమి ప్రభుత్వానికి శనివారం కృతజ్ఞతలు తెలిపారు.







































