శక్తి యాప్ పై ఆమదాలవలసలో అవగాహన కార్యక్రమం

454చూసినవారు
శక్తి యాప్ పై ఆమదాలవలసలో అవగాహన కార్యక్రమం
ఆమదాలవలస పట్టణంలోని స్థానిక బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి టీమ్ ఇన్‌చార్జ్ జ్యోతి మెండా, పి.వి. రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలపై నేరాల నివారణ, పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధం, చిన్నారుల అదృశ్యం, కిడ్నాప్‌ల నివారణ, మాదకద్రవ్యాల వ్యతిరేక చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ల 112,100,181,1972, 1930 గురించి వివరించారు.