రానున్న రోజుల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని బి. ఆర్. ఆర్. వంశధార ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అరవల రవీంద్ర ఆదేశించారు. సెప్టెంబర్ 22 నుంచి 25వ తేదీ వరకు తుపాను ప్రభావం, భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నందున వంశధార ప్రాజెక్ట్ పరిధిలోని కుడి, ఎడమ ప్రధాన కాలువలను పూర్తిగ సిద్ధం చేయాలని సూచించారు. శ్రీకాకుళం, ఆముదాలవలసలో ఇరిగేషన్ అధికారులతో నిర్వహించిన వరదల సన్నద్ధత సమావేశంలో ఈ ఆదేశాలు జారీ చేశారు.