ఎచ్చెర్ల - Etcherla

వీడియోలు


కరీంనగర్ జిల్లా
తాండూర్‌లో అరుదైన తెల్ల కాకి ప్రత్యక్షం
Oct 28, 2025, 07:10 IST/

తాండూర్‌లో అరుదైన తెల్ల కాకి ప్రత్యక్షం

Oct 28, 2025, 07:10 IST
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా తాండూర్‌లో ఓ ఇంటి వద్ద అరుదైన తెల్ల రంగు హౌస్ క్రో (దేశీయ కాకి) కనిపించింది. హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యుడు శ్రీపతి వైష్ణవ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. జిల్లాలో పూర్తి తెల్ల కాకి కనిపించడం ఇదే తొలిసారి. ఈ కాకి ల్యూసిజం అనే అరుదైన జన్యు పరిస్థితితో బాధపడుతోందని, దీనివల్ల ఈకలు తెల్లగా మారినా కళ్లు సహజంగా ఉంటాయని ఆయన తెలిపారు. అల్బినిజంలో కళ్లతో సహా శరీరం తెల్లబడుతుందని, ల్యూసిజంలో కళ్లు సాధారణంగా ఉంటాయని, ఇదే రెండింటి మధ్య తేడా అని వివరించారు. ఇలాంటి అరుదైన పక్షిని సంరక్షించడం శాస్త్రీయ అధ్యయనానికి ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.