ప్రభుత్వ బడిలో చేరికకు విద్యార్థికి నగదు పురస్కారం

1245చూసినవారు
ప్రభుత్వ బడిలో చేరికకు విద్యార్థికి నగదు పురస్కారం
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కేశవరావుపేటలో, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికకు కృషి చేసిన ఏడవ తరగతి విద్యార్థి జోనందన్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు బుడుమూరు గోవిందరావు నగదు పురస్కారంతో సత్కరించారు. సోమవారం పాఠశాల ప్రార్థనా సమయంలో జోనందన్ కు వెయ్యి రూపాయల నగదును అందజేశారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించడంలో జోనందన్ చేసిన సేవలను గుర్తించి ఈ పురస్కారం అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్