బాతువలో ఎంపీటీసీ అభ్యర్థి కలిశెట్టి శాంతారావు ఎన్నికల ప్రచారం

1చూసినవారు
బాతువలో ఎంపీటీసీ అభ్యర్థి కలిశెట్టి శాంతారావు ఎన్నికల ప్రచారం
సిగడాం మండలం బాతువ గ్రామంలో మంగళవారం వైఎస్సార్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి కలిశెట్టి శాంతారావు ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ నాయకులు పల్లెడ సన్యాసిరావు, బూటు అప్పారావు మరియు పలువురు కార్యకర్తలు పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కలిశెట్టి శాంతారావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పార్టీ విజయం గ్రామాభివృద్ధికి పునాది అని వారు పేర్కొన్నారు. భారీ సంఖ్యలో ప్రజలు మరియు నాయకులు ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్