
కంచిలి: గంజాయి స్వాధీనం.. ఇద్దరూ అరెస్టు
శనివారం కంచిలి మండలం లో ఒరిస్సాకు చెందిన మిలన్ మిచెల్, దీప బిదేషి అనే ఇద్దరు వ్యక్తులు 24 కేజీల గంజాయిని ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా ఎస్సై పారి నాయుడు వారిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఈ గంజాయిని రైలు ద్వారా తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సీఐ మంగరాజు మాట్లాడుతూ ఎస్సై సమయస్ఫూర్తితో ఈ అరెస్టు చేశారని పేర్కొన్నారు.




































