ఇచ్ఛాపురంలో ఎంఆర్ కు వైసీపీ శ్రేణులు వినతి

1330చూసినవారు
ఇచ్ఛాపురంలో ఎంఆర్ కు వైసీపీ శ్రేణులు వినతి
రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ అన్నారు. శనివారం ఇచ్ఛాపురం ఎంఆర్ఓకు వైసీపీ శ్రేణులు వినతిపత్రం అందజేసి, సకాలంలో యూరియా సరఫరా చేయాలని కోరారు. మండలంలో 7,789 ఎకరాల్లో వరిసాగు చేశారని, 560 ఎంటీ యూరియా అవసరం కాగా, కేవలం 313 ఎంటీ యూరియాను మాత్రమే రైతులకు సరఫరా చేశారని తెలిపారు. దీంతో రైతులకు సరిపడా యూరియా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్