
వైసీపీ నాయకులు టీడీపీలో చేరిక
సంతబొమ్మాళి మండలం రాజకీయాల్లో ఒక శుభ పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చేపడుతున్న ప్రగతిశీల పాలన, సంక్షేమ కార్యక్రమాలను విశ్వసించి, వైసీపీ నాయకులు, కోటపాడు పంచాయతీ మాజీ సర్పంచ్ అప్పలరాజు, వడ్డీతాండ్ర పంచాయతీ నాయకులు వాడ్రేవు శివప్రసాద్, అతని సోదరులు, ముద్దపు కృష్ణారావు తెలుగుదేశం పార్టీలో ఆదివారం చేరారు. క్యాంప్ కార్యాలయంలో మంత్రి అచ్చన్న వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.





































