నరసన్నపేట మండల కేంద్రంలోని సచివాలయ-వెల్నెస్ కేంద్రంలో వృద్ధులకు ప్రత్యేకంగా ఉచిత నేత్ర తనిఖీలు నిర్వహించామని నేత్ర శస్త్ర సహాయ నిపుణులు బాలగంగాధర్ రాజు తెలిపారు. 82 మంది వృద్ధులకు శుక్రవారం పరీక్షించారు. వీరిలో ఎనిమిది మంది దృష్టిలోపంతో ఉన్నట్లు గుర్తించారు. ఉచితంగా క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.