ఏరువాక పున్నమి ప్రారంభంతో రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. జలుమూరు మండలంలో పలు గ్రామాల్లో రైతులు పంట భూముల్లో దుక్కులు చేస్తున్నారు. గత ఏడాది 22,132 ఎకరాల్లో వరి సాగు జరిగిందని ఏవో రవికుమార్ తెలిపారు. ఈ ఏడాది వివిధ రకాల వరి విత్తనాలు 826 క్వింటాళ్లు ఆర్ఎస్కేలకు వచ్చాయని, ఇప్పటికే వరి విత్తనాలు, యూరియా పంపిణీ చేశామని మంగళవారం ఆయన వివరించారు.