నరసన్నపేట: పౌర్ణమి చంద్రునికి భక్తిశ్రద్ధలతో కర్పూర హారతులు

1258చూసినవారు
నరసన్నపేట మండలం సత్యవరం గ్రామంలోని శ్రీ ఉమా కామేశ్వర స్వామి ఆలయంలో సోమవారం రాత్రి ఘనంగా జేష్ఠ పౌర్ణమి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ముత్తైదువులతో లక్ష్మీనారాయణ సహస్రనామ పారాయణ నిర్వహించారు. అనంతరం పౌర్ణమి చంద్రునికి సామూహికంగా కర్పూర హారతులు సమర్పించారు. ప్రధాన అర్చకులు వాసనాభి హేమానంద్ మాట్లాడుతూ, ఆలయ పునఃప్రతిష్ట తర్వాత ఈ కార్యక్రమాలు ఆధ్యాత్మికతను పెంపొందిస్తున్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్