నరసన్నపేట: భద్రత పింఛన్లతో నిరుపేదలకు ఆర్థిక భరోసా

0చూసినవారు
నరసన్నపేట: భద్రత పింఛన్లతో నిరుపేదలకు ఆర్థిక భరోసా
కూటమి ప్రభుత్వం హయాంలో ప్రతినెల 1వ తేదీనే అందజేస్తున్న ఎన్టీఆర్ భద్రత పింఛన్లతో నిరుపేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని మాజీ ఎంపీటీసీ నేతింటి భారతి విశ్వేశ్వరరావు తెలిపారు. బుధవారం నరసన్నపేట పట్టణంలో భద్రతా పెన్షన్లను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఈ పింఛన్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయనతో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్