నరసన్నపేట మేజర్ పంచాయతీ పరిధిలోని వజ్రం పేట వీధి వాసులు గత రెండు నెలలుగా కొళాయిల ద్వారా తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై సోమవారం పంచాయతీ అధికారులకు తెలియజేయడానికి కార్యాలయానికి చేరుకున్నా, వారు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఆవేదనతో వెనుదిరిగారు. తాగునీటి అవస్థలు త్వరగా తీరాలని వారు కోరుతున్నారు.