శ్రీకాకుళం జిల్లాలో మనబడి మన భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా, గతంలో 'నాడు-నేడు' పథకంలో నిలిచిపోయిన నిర్మాణ పనులను చేపడుతున్నామని సమగ్ర శిక్ష అభియాన్ ఈఈ కె.వి.ఎన్. మూర్తి తెలిపారు. సోమవారం నరసన్నపేటలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 168 పాఠశాలల్లో 14 కోట్ల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభిస్తున్నామని, ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు. బాలికల కోసం మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.