నరసన్నపేట: ఉర్లాం లో నిలిచిన గ్రామీణ వికాస్ బ్యాంక్ సేవలు

1706చూసినవారు
నరసన్నపేట: ఉర్లాం లో నిలిచిన గ్రామీణ వికాస్ బ్యాంక్ సేవలు
నరసన్నపేట మండలం ఉర్లాం ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ శాఖ సేవలు గత పది రోజులుగా నిలిచిపోయాయి. దీంతో ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంక్ మేనేజర్ బి శ్రీకర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈనెల 18వ తేదీన పిడుగులు పడటం వల్ల సాంకేతిక సమస్యలు తలెత్తాయి. పై అధికారులకు సమాచారం అందించామని, మరో రెండు రోజుల్లో సేవలు పునరుద్ధరిస్తామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్