నరసన్నపేట: పచ్చిక మైదానాన్ని తలపిస్తున్న వంశధార కాలువ..?

1575చూసినవారు
నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక దేశవానిపేట వద్ద పోలాకి రహదారిలో ఉన్న కిల్లాం ఛానల్ పరిధిలో వంశధార కాలువ పచ్చిక మైదానాన్ని తలపిస్తుంది. ఖరీఫ్ పంటకు రైతులు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇలా కాలువలు దర్శనం ఇవ్వటంతో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయని రైతులు తెలిపారు. మరో 15 రోజుల్లో సాగునీరు విడిచి పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందని కాలువ ఇలా ఉంటే సాగునీరు పారేది ఎలా అని మంగళవారం రైతులు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్