సారవకోట మండలం అవలంగి గ్రామంలోని శ్రీ నీలమణి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఆదివారం అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు భాస్కరరావు ఆచారి తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఉత్సవాలు వచ్చే నెల 2వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆదివారం జరిగిన పూజలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, తీర్థప్రసాదాలు స్వీకరించారు.